Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Friday, September 20, 2013

యిర్మియా48


Jer 48:1  మోయాబునుగూర్చినది. ఇశ్రాయేలు దేవుడగు యెహోవా ఈలాగు సెలవిచ్చు చున్నాడు. నెబోకు శ్రమ, అది పాడైపోవుచున్నది. కిర్యతాయిము పట్టబడినదై అవమానము నొందుచున్నది ఎత్తయిన కోట పడగొట్టబడినదై అవమానము నొందుచున్నదిఇకను మోయాబునకు ప్రసిద్ధియుండదు. 
Jer 48:2  హెష్బోనులో వారు అది ఇకను జనము కాకపోవు నట్లు దాని కొట్టివేయుదము రండని చెప్పుకొనుచు దానికి కీడు చేయ నుద్దేశించుచున్నారు మద్మేనా, నీవును ఏమియు చేయలేకపోతివి. ఖడ్గము నిన్ను తరుముచున్నది. 
Jer 48:3  ఆలకించుడి, హొరొనయీమునుండి రోదనధ్వని విన బడుచున్నది దోపుడు జరుగుచున్నది మహాపజయము సంభవించు చున్నది. 
Jer 48:4  మోయాబు రాజ్యము లయమై పోయెను దాని బిడ్డల రోదనధ్వని వినబడుచున్నది. 
Jer 48:5  హొరొనయీము దిగుదలలో పరాజితుల రోదనధ్వని వినబడుచున్నది జనులు లూహీతు నెక్కుచు ఏడ్చుచున్నారు ఏడ్చుచు ఎక్కుచున్నారు. 
Jer 48:6  పారిపోవుడి మీ ప్రాణములను దక్కించుకొనుడి అరణ్యములోని అరుహవృక్షమువలె ఉండుడి. 
Jer 48:7  నీవు నీ క్రియలను ఆశ్రయించితివి నీ నిధులను నమ్ము కొంటివి నీవును పట్టుకొనబడెదవు, కెమోషుదేవత చెరలోనికి పోవును ఒకడు తప్పకుండ వాని యాజకులును అధిపతులును చెరలోనికి పోవుదురు. 
Jer 48:8  యెహోవా సెలవిచ్చునట్లు సంహారకుడు ప్రతి పట్టణముమీదికి వచ్చును ఏ పట్టణమును తప్పించుకొనజాలదు లోయకూడ నశించును మైదానము పాడైపోవును. 
Jer 48:9  మోయాబునకు రెక్కలు పెట్టుడి అది వేగిరముగా బయలుదేరి పోవలెను. నివాసి యెవడును లేకుండ దాని పట్టణములు పాడగును. 
Jer 48:10  యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తు డగును గాక రక్తము ఓడ్చకుండ ఖడ్డము దూయువాడు శాపగ్రస్తు డగును గాక. 
Jer 48:11  మోయాబు తన బాల్యమునుండి నెమ్మది నొందెను ఈ కుండలోనుండి ఆ కుండలోనికి కుమ్మరింపబడకుండ అది మడ్డిమీద నిలిచెను అదెన్నడును చెరలోనికి పోయినది కాదు అందుచేత దాని సారము దానిలో నిలిచియున్నదిదాని వాసన ఎప్పటివలెనే నిలుచుచున్నది. 
Jer 48:12  యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు రాగల దినములలో నేను దానియొద్దకు కుమ్మరించు వారిని పంపెదను. వారు దాని కుమ్మరించి దాని పాత్రలను వెలితిచేసివారి జాడీలను పగులగొట్టెదరు. 
Jer 48:13  ఇశ్రాయేలువారు తామాశ్రయించిన బేతేలునుబట్టి సిగ్గుపడినట్లు మోయాబీయులును కెమోషునుబట్టి సిగ్గుపడుచున్నారు 
Jer 48:14  మేము బలాఢ్యులమనియు యుద్ధశూరులమనియు మీరెట్లు చెప్పుకొందురు? 
Jer 48:15  మోయాబు పాడైపోవుచున్నది శత్రువులు దాని పట్టణములలో చొరబడుచున్నారు వారి యౌవనులలో శ్రేష్ఠులు వధకు పోవుచున్నారు సైన్యములకధిపతియగు యెహోవా అను పేరుగల రాజు సెలవిచ్చినమాట యిదే. 
Jer 48:16  మోయాబునకు సమూలనాశనము సమీపించుచున్నది దానికి సంభవించు దుఃఖము త్వరపడి వచ్చుచున్నది. 
Jer 48:17  దానిచుట్టునున్న మీరందరు దానినిగూర్చి అంగలార్చుడి దాని కీర్తినిగూర్చి విననివారలారా, అంగలార్చుడి బలమైన రాజదండము ప్రభావముగల రాజదండము విరిగిపోయెనే యని చెప్పుకొనుడి. 
Jer 48:18  దేబోనులో ఆసీనురాలై యుండుదానా, మోయాబును పాడుచేసినవాడు నీ మీదికి వచ్చు చున్నాడు. నీ కోటలను నశింపజేయుచున్నాడు. నీ గొప్పతనము విడిచి దిగిరమ్ముఎండినదేశములో కూర్చుండుము. 
Jer 48:19  ఆరోయేరు నివాసీ, త్రోవలో నిలిచి కనిపెట్టుము పారిపోవుచున్న వారియొద్ద విచారించుము తప్పించుకొనిపోవుచున్నవారిని అడుగుము ఏమి జరిగినదో వారివలన తెలిసికొనుము. 
Jer 48:20  మోయాబు పడగొట్టబడినదై అవమానము నొంది యున్నది గోలయెత్తి కేకలువేయుము మోయాబు అపజయము నొందెను. అర్నోనులో ఈ సంగతి తెలియజెప్పుడి 
Jer 48:21  మైదానములోని దేశమునకు శిక్ష విధింపబడియున్నది హోలోనునకును యాహసునకును మేఫాతునకును దీబోనుకును 
Jer 48:22  నెబోకును బేత్‌దిబ్లాతయీమునకును కిర్యతాయిమున కును బేత్గామూలునకును 
Jer 48:23  బేత్మెయోనునకును కెరీయోతునకును బొస్రాకును దూరమైనట్టియు సమీపమైనట్టియు 
Jer 48:24  మోయాబుదేశ పురములన్నిటికిని శిక్ష విధింపబడి యున్నది. 
Jer 48:25  మోయాబు శృంగము నరికివేయబడియున్నది దాని బాహువు విరువబడియున్నది యెహోవా వాక్కు ఇదే. 
Jer 48:26  మోయాబు యెహోవాకు విరోధముగా తన్ను తాను గొప్పచేసికొనెను దాని మత్తిల్లజేయుడి మోయాబు తన వమనములో పొర్లుచున్నది అది అపహాస్యమునొందును. 
Jer 48:27  ఇశ్రాయేలును నీవు అపహాస్యాస్పదముగా ఎంచలేదా? అతడు దొంగలకు జతగాడైనట్టుగా నీవు అతనిగూర్చి పలుకునప్పుడెల్ల తల ఆడించుచు వచ్చితివి 
Jer 48:28  మోయాబు నివాసులారా, పట్టణములు విడువుడి కొండపేటు సందులలో గూడు కట్టుకొను గువ్వలవలె కొండలో కాపురముండుడి. 
Jer 48:29  మోయోబీయుల గర్వమునుగూర్చి వింటిమి, వారు బహు గర్వపోతులు వారి అతిశయమునుగూర్చియు గర్వమునుగూర్చియు 
Jer 48:30  అహంకారమునుగూర్చియు పొగరునుగూర్చియు మాకు సమాచారము వచ్చెను వారి తామసమును వచించరాని వారి ప్రగల్భము లును నాకు తెలిసేయున్నవి చేయదగని క్రియలు వారు బహుగా చేయుచున్నారు ఇదే యెహోవా వాక్కు 
Jer 48:31  కాబట్టి మోయాబు నిమిత్తము నేను అంగలార్చు చున్నాను మోయాబు అంతటిని చూచి కేకలు వేయుచున్నాను వారు కీర్హరెశు జనులు లేకపోయిరని మొఱ్ఱపెట్టు చున్నారు. 
Jer 48:32  సిబ్మా ద్రాక్షవల్లీ, యాజెరునుగూర్చిన యేడ్పును మించునట్లు నేను నిన్నుగూర్చి యేడ్చుచున్నాను నీ తీగెలు ఈ సముద్రమును దాటి వ్యాపించెను అవి యాజెరుసముద్రమువరకు వ్యాపించెను నీ వేసవికాల ఫలములమీదను ద్రాక్షగెలలమీదను పాడుచేయువాడు పడెను. 
Jer 48:33  ఫలభరితమైన పొలములోనుండియు మోయాబు దేశములోనుండియు ఆనందమును సంతోషమును తొలగిపోయెను ద్రాక్షగానుగలలో ద్రాక్షారసమును లేకుండ చేయు చున్నాను జనులు సంతోషించుచు త్రొక్కరు సంతోషము నిస్సంతోషమాయెను. 
Jer 48:34  నిమీములో నీళ్లు సహితము ఎండిపోయెను హెష్బోను మొదలుకొని ఏలాలేవరకును యాహసు వరకును సోయరు మొదలుకొని హొరొనయీమువరకును ఎగ్లాత్షాలిషావరకును జనులు కేకలువేయుచున్నారు. 
Jer 48:35  ఉన్నతస్థలమున బలులు అర్పించువారిని దేవతలకు ధూపమువేయువారిని మోయాబులో లేకుండజేసెను ఇదే యెహోవా వాక్కు. 
Jer 48:36  వారు సంపాదించినదానిలో శేషించినది నశించి పోయెను మోయాబునుగూర్చి నా గుండె పిల్లనగ్రోవివలె నాదము చేయుచున్నది కీర్హరెశువారినిగూర్చి నా గుండె పిల్లనగ్రోవివలె వాగు చున్నది. 
Jer 48:37  నిశ్చయముగా ప్రతి తల బోడియాయెను ప్రతి గడ్డము గొరిగింపబడెను చేతులన్నిటిమీద నరుకులును నడుములమీద గోనెపట్టయు నున్నవి. 
Jer 48:38  మోయాబు ఇంటి పైకప్పులన్నిటిమీదను దాని వీధులలోను అంగలార్పు వినబడుచున్నది ఒకడు పనికిమాలిన ఘటమును పగులగొట్టునట్లు నేను మోయాబును పగులగొట్టుచున్నాను ఇదే యెహోవా వాక్కు. 
Jer 48:39  అంగలార్చుడి మోయాబు సమూలధ్వంసమాయెను మోయాబూ, నీవు వెనుకకు తిరిగితివే, సిగ్గుపడుము. మోయాబు తన చుట్టునున్న వారికందరికి అపహాస్యాస్పదముగాను భయకారణముగాను ఉండును. 
Jer 48:40  యెహోవా సెలవిచ్చునదేమనగా పక్షిరాజు ఎగురునట్లు ఎగిరి అది మోయాబు మీద తన రెక్కలను చాపుచున్నది. 
Jer 48:41  కోటలు పడగొట్టబడియున్నవి దుర్గములు పట్టబడి యున్నవి. ఆ దినమున మోయాబు శూరుల హృదయము ప్రసవించు స్త్రీ హృదయమువలె ఉండును. 
Jer 48:42  మోయాబు యెహోవాకంటె గొప్పవాడనని అతిశయ పడగా అది జనము కాకుండ నిర్మూలమాయెను. 
Jer 48:43  మోయాబు నివాసీ, భయమును గుంటయు ఉరియు నీమీదికి వచ్చియున్నవి 
Jer 48:44  ఇదే యెహోవా వాక్కు. భయము తప్పించుకొనుటకై పారిపోవువారు గుంటలో పడుదురు గుంటలోనుండి తప్పించుకొనువారు ఉరిలో చిక్కు కొందురు మోయాబుమీదికి విమర్శ సంవత్సరమును నేను రప్పించుచున్నానుఇదే యెహోవా వాక్కు. దేశ పరిత్యాగులగువారు బలహీనులై హెష్బోనునీడలో నిలిచియున్నారు. 
Jer 48:45  హెష్బోనులోనుండి అగ్నియు సీహోను మధ్యనుండి జ్వాలలును బయలుదేరి 
Jer 48:46  మోయాబు శిరస్సును, సందడిచేయువారి నడినెత్తిని కాల్చివేయుచున్నవి. మోయాబూ, నీకు శ్రమ కెమోషుజనులు నశించియున్నారు నీ కుమారులు చెరపట్టబడిరి చెరపట్టబడినవారిలో నీ కుమార్తెలున్నారు. 
Jer 48:47  అయితే అంత్యదినములలో చెరపట్టబడిన మోయాబు వారిని నేను తిరిగి రప్పించెదను ఇదే యెహోవా వాక్కు. ఇంతటితో మోయాబునుగూర్చిన శిక్షావిధి ముగిసెను. 

No comments:

Post a Comment