Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Friday, September 20, 2013

యిర్మియా41


Jer 41:1  ఏడవ మాసమున ఎలీషామా మనుమడును నెతన్యా కుమారుడును రాజవంశస్థుడును రాజుయొక్క ప్రధాను లలో నొకడునగు ఇష్మాయేలనువాడును, అతనితో పది మంది మనుష్యులును, మిస్పాలోనున్న అహీకాము కుమారు డైన గెదల్యాయొద్దకు వచ్చి అక్కడ అతనితోకూడ మిస్పాలో భోజనముచేసిరి. 
Jer 41:2  అప్పుడు నెతన్యా కుమారు డైన ఇష్మాయేలు అతనితో కూడనున్న ఆ పదిమంది మనుష్యులును లేచి షాఫాను మనుమడును అహీకాము కుమారుడైన గెదల్యాను ఖడ్గముచేత హతముచేసిరి; బబు లోనురాజు ఆ దేశముమీద అతని అధికారినిగా నియ మించినందున అతని చంపిరి. 
Jer 41:3  మరియు మిస్పాలో గెదల్యా యొద్ద ఉండిన యూదుల నందరిని, అక్కడ దొరికిన యోధులగు కల్దీయులను ఇష్మాయేలు చంపెను. 
Jer 41:4  అతడు గెదల్యాను చంపిన రెండవనాడు అది ఎవరికిని తెలియబడక మునుపు 
Jer 41:5  గడ్డములు క్షౌరము చేయించుకొని వస్త్రములు చింపుకొని దేహములు గాయపరచుకొనిన యెనుబదిమంది పురుషులు యెహోవా మందిరము నకు తీసికొని పోవుటకై నైవేద్యములను ధూపద్రవ్యములను చేతపట్టుకొని షెకెము నుండియు షిలోహు నుండియు షోమ్రోనునుండియు రాగా 
Jer 41:6  నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు దారి పొడుగున ఏడ్చుచు, వారిని ఎదుర్కొనుటకు మిస్పాలోనుండి బయలు వెళ్లి వారిని కలిసికొని వారితో-- అహీకాము కుమారుడైన గెదల్యా యొద్దకు రండనెను. 
Jer 41:7  అయితే వారు ఆ పట్టణము మధ్యను ప్రవేశించినప్పుడు నెతన్యా కుమారుడైన ఇష్మా యేలును అతనితోకూడ ఉన్నవారును వారిని చంపి గోతిలో పడవేసిరి. 
Jer 41:8  అయితే వారిలో పదిమంది మను ష్యులు ఇష్మాయేలుతోపొలములలో దాచబడిన గోధు మలు యవలు తైలము తేనె మొదలైన ద్రవ్యములు మాకు కలవు, మమ్మును చంపకుమని చెప్పుకొనగా అతడు వారి సహోదరులతో కూడ వారిని చంపక మానెను. 
Jer 41:9  ఇష్మా యేలు గెదల్యాతోకూడ చంపిన మనుష్యుల శవములన్ని టిని పడవేసిన గోయి రాజైన ఆసా ఇశ్రాయేలు రాజైన బయషాకు భయపడి త్రవ్వించిన గొయ్యియే; నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు చంపబడినవారి శవములతో దాని నింపెను. 
Jer 41:10  అప్పుడు ఇష్మాయేలు మిస్పాలోనున్న జనశేష మంతటిని రాజ కుమార్తెలనందరిని అనగా రాజదేహసంరక్ష కుల కధిపతియైన నెబూజరదాను అహీకాము కుమారుడైన గెదల్యాకు అప్పగించిన జనులందరిని, చెరతీసికొనిపోయెను. నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు వారిని చెరతీసికొనిపోయి అమ్మోనీయులయొద్దకు చేరవలెనని ప్రయత్నపడుచుండగా 
Jer 41:11  కారేహ కుమారుడైన యోహానానును అతనితోకూడనున్న సేనాధిపతులందరును నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు చేసిన సమస్త దుష్కార్యములను గూర్చిన వార్త విని 
Jer 41:12  పురుషులనందరిని పిలుచుకొని, నెతన్యా కుమారుడైన ఇష్మా యేలుతో యుద్ధము చేయబోయి, గిబియోనులోనున్న మహా జలముల దగ్గర అతని కలిసికొనిరి. 
Jer 41:13  ఇష్మాయేలుతో కూడనున్న ప్రజలందరు కారేహ కుమారుడైన యోహా నానును, అతనితో కూడనున్న సేనాధిపతులనందరిని చూచినప్పుడు వారు సంతోషించి 
Jer 41:14  ఇష్మాయేలు మిస్పాలో నుండి చెరగొనిపోయిన ప్రజలందరు అతని విడిచి కారేహ కుమారుడైన యెహానానుతో కలిసిరి. 
Jer 41:15  అయినను, నెతన్యా కుమారుడైన ఇష్మాయేలును ఎనమండుగురు మనుష్యులును యోహానాను చేతిలోనుండి తప్పించుకొని అమ్మోనీయుల యొద్దకు పారి పోయిరి. 
Jer 41:16  అప్పుడు నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు అహీకాము కుమారుడైన గెద ల్యాను చంపిన తరువాత, 
Jer 41:17  కారేహ కుమారుడైన యోహా నానును అతనితో కూడనున్న సేనల యధిపతులందరును మిస్పాదగ్గరనుండి ఇష్మాయేలు నొద్దనుండి జనశేషమంతటిని, అనగా గిబియోను దగ్గరనుండి ఇష్మాయేలు కొనిపోయిన యోధులను స్త్రీలను పిల్లలను, రాజపరివారమును మరల రప్పించిరి; 
Jer 41:18  అయితే వారు బబులోనురాజు దేశముమీద అధికారినిగా నియమించిన అహీకాము కుమారుడైన గెదల్యాను నెతన్యా కుమారుడైన ఇష్మా యేలు చంపినందున వారు కల్దీయులకు భయపడి ఐగుప్తునకు వెళ్లుదమనుకొని బేత్లెహేముదగ్గరనున్న గెరూతు కింహాములో దిగిరి. 

No comments:

Post a Comment